- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వసతులు ఉన్నా.. వైద్యం చేయరు
ఖమ్మం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) లో క్యాజువాల్టీలో సరిపడా వసతులు ఉన్నా రోగులకు సరైన వైద్యం అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఆస్పత్రికి ప్రతి రోజూ 1500 నుంచి 2000 మంది రోగులు వస్తుంటారు.

ఖమ్మం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్) లో క్యాజువాల్టీలో సరిపడా వసతులు ఉన్నా రోగులకు సరైన వైద్యం అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఆస్పత్రికి ప్రతి రోజూ 1500 నుంచి 2000 మంది రోగులు వస్తుంటారు. రోడ్డు ప్రమాదం, స్పృహ తప్పి పడిపోవడం వంటి కేసులు వచ్చినప్పుడు క్యాజువాల్టీలో అన్నీ వసతులు ఉన్నా.. సరైన సమయానికి సిబ్బంది ఉండటంలేదు. ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు తప్ప, ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు సిబ్బంది కనిపించడం లేదు. ఎమర్జెన్సీ సంబంధించిన మందులు కూడా అందుబాటులో లేవు. ఈసీజీ టెక్నీషియన్ క్యాజువాల్టీలో ఉండకుండా బయట తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నట్లు తెలుస్తోంది. క్యాజువాల్టీ లో ఎమర్జెన్సీ వచ్చే రోగులకు రక్త నమూనాలను సేకరించేందుకు ల్యాబ్ టెక్నీషియన్(ఎల్టీ) లు కూడా అందుబాటులో ఉండటంలేదు. క్యాజువాల్టీలో రోగులకు క్యాజువాలిటీ సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారని, ఎమర్జెన్సీ రోగులకు వైద్య సేవలు అందించకుండా ముందుగా ఓపీ తీసుకురావాలని చెబుతున్నట్లు సమాచారం. అది లేదు ఇది లేదంటూ వైద్య సేవలను అందించకుండా పని తప్పించుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
దిశ, ఖమ్మం: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని పాలకులు, అధికారులు చెబుతున్నా... దానికి తగ్గట్టుగా వైద్యసేవలు అందడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో(జీజీహెచ్) క్యాజువాల్టీలో వసతులు ఉన్న రోగులకు వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు. జీజీహెచ్‌కు ప్రతి రోజూ 1500 నుంచి 2000 మంది రోగులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఎమర్జెన్సీ వచ్చే కేసులు క్యాజువాల్టీలో ఉంచి రోగి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత వార్డుకి పంపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం క్యాజువాల్టీలో వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుకోవడంతో రోగులు ప్రాణాలు గాల్లో కలిసిపోయిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఇటీవల ఖమ్మం నగరంలో ఓ వ్యక్తి కరెంట్ షాక్ తగిలి జీజీహెచ్‌కు వస్తే రోగి బతికి ఉన్నాడా.. లేదా అనేది ఈసీజీ మిషన్ ద్వారా తెలుసుకునేందుకు గంటలకొద్దీ వేచి ఉండే పరిస్థితి నెలకొంది. రోగి బంధువులు అక్కడ సిబ్బంది స్పందించకపోవడంతో అతన్ని తీసుకువెళ్లే పరిస్థితి ఏర్పడింది. క్యాజువాల్టీలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న పై అధికారులు దృష్టి సారించడం లేదని రోగులు చెబుతున్నారు.
నామా మాత్రంగా వైద్యసేవలు..
రోగులకు ఎమర్జెన్సీ వైద్యసేవలు అందించేందుకు క్యాజువాల్టీ ప్రధాన ఉద్దేశం. ఈ క్యాజువాల్టీ రోగులకు నామా మాత్రంగానే వైద్య సేవలు అందిస్తున్నారు. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మెరుగైన వైద్యసేవలు అందించి రోగి ప్రాణాలు కాపాడాలి. కానీ కొంతమంది వైద్యసిబ్బంది సరైన సమయంలో అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదం, స్పృహ తప్పి పడిపోవడం అలాంటి కేసులు వచ్చినప్పుడు క్యాజువాల్టీలో అన్నీ వసతులు ఉన్నాయి. వసతులకు తగట్టు సిబ్బంది ఉండటంలేదు. ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు కనిపించడం తప్ప, ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు సిబ్బంది అందుబాటులో ఉండటంలేదు. దాంతో పాటు ఎమర్జెన్సీ సంబంధించిన మందులు కూడా అందుబాటులో లేవు. రాత్రి పూట ఎమర్జెన్సీ క్యాజువాల్టీ వచ్చే రోగులు నరకం చూపిస్తున్నారు. రాత్రి పూట జీజీహెచ్ లో మెడికల్ షాపు ఉండదు, జీజీహెచ్ గేటు దగ్గర ఉన్న మెడికల్ షాపు దిక్కే. దాంతో రాత్రి పూట ఎమర్జెన్సీ మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు.
కనిపించని టెక్నిషియన్స్
జీజీహెచ్ క్యాజువాల్టీలో ఈసీజీ మిషన్ ఉన్న టెక్నిషియన్స్ కనిపించడం లేదు. ట్రైనింగ్‌కు వచ్చే విద్యార్థులే ఈసీజీ టెక్నీషియన్లుగా కనిపిస్తున్నారు. జీజీహెచ్ లో ఈసీజీ టెక్నీషియన్ మాత్రం క్యాజువాల్టీలో ఉండకుండా బయట అటూఇటూ తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ వచ్చే రోగులకు హార్ట్ బీట్ ఉందా లేదా అనే కోణంలో పరీక్షించేందుకు ఈసీజీ మిషన్ కీలకం, అలాంటి కీలకమైన ఈసీజీ మిషన్ కు టెక్నీషియన్ అందుబాటులో ఉండకపోవడంతో రోగులు గంటలకు వేచి ఉండే పరిస్థితి నెలకొంది. అక్కడ టెక్నీషియన్ లేకపోతే లోపల ఇంకో ఈసీజీ మిషన్ దగ్గరకు వెళ్లి తీయించుకోవాలని సిబ్బంది చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఎమర్జెన్సీగా ఉండే కేసులను ఎందుకు పంపించాలి అనే కోణంలో ఆలోచన చేయకపోవడంతో రోగుల ప్రాణానకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
శాంపిల్స్ తీసేవారేరి?
క్యాజువాల్టీ లో ఎమర్జెన్సీ వచ్చే రోగులకు రక్త నమూనాలను సేకరించేందుకు ల్యాబ్ టెక్నీషియన్(ఎల్టీ) లు కూడా అందుబాటులో ఉండటంలేదు. రోగి క్యాజువాల్టీలో ఉన్న ఎమర్జెన్సీగా శాంపిల్స్ తీసుకొని పరీక్షలు చేయాలి, కానీ క్యాజువాల్టీ లో అలాంటి ఏమి ఉండదు రోగిని స్ట్రక్చర్ పైనే పడుకోబెట్టి అటు ఇటు తిప్పుకుంటూ నాన్న ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ట్రైనింగ్ కు వచ్చే పారామెడికల్ సిబ్బంది షాంపిల్స్ తీయటంలో కూడా నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న అధికారులు సరైన చర్యలు తీసుకోపోవటంతోనే సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రోగులు చెబుతున్నారు.
రోగులకు చుక్కలే..
క్యాజువాల్టీలో రోగులకు క్యాజువాలిటీ సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ఎమర్జెన్సీ గా వచ్చే రోగులకు వైద్య సేవలు అందించకుండా ముందుగా ఓపి తీసుకురావాలని చెబుతున్నారు. ఎమర్జెన్సీ వచ్చే రోగులకు ఓపి ముఖ్యమో.. వైద్య సేవలు ముఖ్యమా.. రోగి తరపున ఎవరైనా అడిగితే వారిపై ఘర్షణకు దిగుతున్నారు. ఎమర్జెన్సీ వచ్చే రోగులకు ఆధార్ కార్డు లేకపోవడంతో వైద్య సేవలు కూడా అందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్ లో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అనేకమార్లు తనిఖీలు చేస్తున్నా సిబ్బంది సరైన గాడి లో ఉండటం లేదని తెలుస్తుంది. అది లేదు ఇది లేదంటూ వైద్య సేవలను అందించకుండా పని తప్పించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రి పై నమ్మకం పెంచే విధంగా పనిచేయాలని రోగులు కోరుతున్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
డాక్టర్ నరేందర్, జీజీహెచ్ సూపరింటెండెంట్
జీజీహెచ్ వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. క్యాజువాలిటీలో రోగులకు అన్ని వసతులు ఉన్నాయి, ఈసీజీ టెక్నీషియన్లు, ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో ఉన్నారు. అలాంటి ఏమైనా సంఘటనలు దృష్టికి వస్తే చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేసేది లేదు.






