- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిబ్బంది కొరత.. సేవలకు వెత..!
తల్లాడ మండల తాసిల్దార్ కార్యాలయాన్ని సిబ్బంది కొరత వేధిస్తుంది. కొన్ని నెలలుగా ఒక్కరే అన్ని బాధ్యతలు చేపడతున్నారు.

దిశ,తల్లాడ: మండల తాసిల్దార్ కార్యాలయాన్ని సిబ్బంది కొరత వేధిస్తుంది. కొన్ని నెలలుగా ఇక్కడ డిప్యూటీ తాసిల్దార్ లేకపోవడంతో ఒక్కరే తాసిల్దార్,ఆర్‌ఐ ఉండడం, ఇతర సిబ్బంది కూడా లేకపోవడంతో ప్రజల అవస్థలు వర్ణాతీతంగా మారాయి. ఇద్దరూ ఆర్‌ఐలు ఉండాల్సి ఉండగా ఒక ఆర్‌ఐ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. తాసిల్దార్ లేని సమయంలో కీలకపాత్ర పోషించాల్సిన రెగ్యులర్ డిప్యూటీ తాసిల్దార్ లేకపోవడంతో ప్రజలు ఏ చిన్న పని కావలసి ఉన్న కాలారిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
సిబ్బంది కొరత..
రీసర్వే డీటీ లేకపోవడంతో రీసర్వే మండల ఇంచార్జ్ సర్వేయర్‌తో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అధికారుల సరైన పర్యవేక్షణ లేక ఫిర్యాదులన్నీ సర్వేయర్ ఒక్కరే పరిశీలించలేకపోతున్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రధానంగా జరుపుతున్న సమయంలో ఇక్కడ ఎలక్షన్ డీటీ కూడా లేరు. తాసిల్దారుగా టీ.కరుణాకర్ రెడ్డి సెప్టెంబర్ 18 తేదీన చార్జ్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన కూడా అత్యవసర పనులు,సర్టిఫికెట్ లాంటి పనులు పూర్తి చేయడానికి పరిమితమై అంతో ఇంతో రీసర్వే బాధ్యతను పర్యవేక్షించడంతో మామ అనిపిస్తున్నారు.ఇక ఎన్నికల ప్రక్రియ సమీపిస్తుండటం, ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రధానంగా జరుపుతున్న సమయంలో ఇక్కడ ఎలక్షన్ డీటీ కూడా లేరు.
మండల తాసిల్దార్ టి.కరుణాకర్ రెడ్డి వివరణ..
- Tags
- khammam






