విధుల్లో ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం

by Bhanu |

విధుల్లో ఓ ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం వల్ల హాస్టల్ విద్యార్థుల విద్యార్థి హాస్టల్ నుంచి బయటికి వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

విధుల్లో ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం
X

దిశ, కారేపల్లి రూరల్: విధుల్లో ఓ ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం వల్ల హాస్టల్ విద్యార్థులపై పర్యవేక్షణ కరువైంది. ఉపాధ్యాయుడు హాస్టల్‌లో లేకపోవడంతో ఓ విద్యార్థి హాస్టల్ నుంచి బయటికి వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన కథన ప్రకారం.. కారేపల్లి మండల పరిధిలోని శాంతినగర్ ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సాగర్ కొంతమంది స్నేహితులతో కలిసి వ్యక్తిగత పనుల కోసం ఇల్లందుకు వచ్చారు, పాఠశాలకు వెళుతున్న క్రమంలో ద్విచక్ర వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదం జరగడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్నఉన్నతాధికారులు పాఠశాలలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విద్యార్థికి రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని ఉపాధ్యాయ బృందం గోప్యంగా ఉంచుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సంఘటన వివరాల కోసం ఏటిడిఓకు వివరణ కోసం ప్రయత్నించగా స్పందించలేదు.

Next Story