- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాద్రిలో శంకర్ దాదా ఎంబీబీఎస్
ఎంబీబీఎస్ చదవకుండానే డాక్టర్ అవతారం ఎత్తి పట్టణ నడిబొడ్డున హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని వైద్యం చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ వైద్యుని బండారం బయటపడింది.

దిశ, భద్రాచలం : ఎంబీబీఎస్ చదవకుండానే డాక్టర్ అవతారం ఎత్తి పట్టణ నడిబొడ్డున హాస్పిటల్ ఏర్పాటు చేసుకుని వైద్యం చేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ వైద్యుని బండారం బయటపడింది. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాన్ని తలపించే ఈ సంఘటన భద్రాచలంలో చోటుచేసుకుంది. రాజశేఖర్ అనే వ్యక్తి కొంత కాలం క్రితం తాను ఎంబీబీఎస్ డాక్టర్ అని, పలువురు కన్సల్టింగ్ వైద్యులతో హాస్పిటల్ పెట్టడానికి అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాడు. ఈ తరుణంలోనే, రాజశేఖర్ డాక్టర్ సర్టిఫికెట్ పై పట్టణంలోని ఐఎంఏ డాక్టర్స్ కు అనుమానం వచ్చింది.
ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారితో పాటు డిఎంఅండ్ హెచ్ ఓ కి పిర్యాదు చేశారు. దీంతో పి ఓ రాహుల్ ఆదేశాల మేరకు బుధవారం ఏ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సైదులు, ఐ ఎం ఏ వైద్యులు డాక్టర్ రమేష్ చంద్ర, డాక్టర్ సురేష్ కుమార్ తదితరులు ఆయుషి పేరుతో నడుపుతున్న ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. డాక్టర్ అవతారం ఎత్తిన రాజశేఖర్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఫేక్ అని గుర్తించి ఆసుపత్రిని సీజ్ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రాజశేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. పట్టణంలో నకిలీ వైద్యుడు బాగోతం బయటపడటంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా నివ్వెరపోయారు.






