- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ సీనియర్ నేత రాజీనామా
దిశ,టేకులపల్లి : ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూక్య దళ్ సింగ్ నాయక్, ఆయన భార్య సూక్కాల

దిశ,టేకులపల్లి : ఇల్లెందు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూక్య దళ్ సింగ్ నాయక్, ఆయన భార్య సూక్కాల బోడు, మాజీ సర్పంచ్ గంగాబాయి శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం టేకులపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ 1987లో ప్రారంభమైన తన రాజకీయ జీవితం 2025లో ఆ పార్టీతో బంధం తెగిపోవడం తన గుండెలు పగిలే విషయమన్నారు. టేకులపల్లి మండలానికి చెందిన గోనెల నారాయణ, మాజీ మంత్రి రాత్రెడ్డి వెంకట్ రెడ్డి శిష్యుడిగా, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అభిమానిగా ఉంటూ.. కాంగ్రెస్ పార్టీలో ఎందరో పార్టీలు మారుతూ వచ్చినా మండలంలో తానొక్కడినే పార్టీ మారకుండా ఉండి కాంగ్రెస్ ఉనికి కోల్పోకుండా చూసినట్లు చెప్పారు. అటువంటి తనను పార్టీలో ఎన్నో అవమానాలకు గురిచేసినట్లు పేర్కొంటూ దళ్ సింగ్ నాయక్ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. తన రాజకీయ భవిష్యత్ కార్యచరణను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. దళ్ సింగ్ నాయక్ నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ 1999 పార్టీ ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.






