రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు ఉపాధ్యాయురాలు మృతి

by velandi.Saikiran |   (  Updated:2025-12-05 19:30:36  IST  )

రహీముద్దీన్- సుహాన దంపతుల కుమార్తె జాస్మిన్ జ్వరం రావడంతో ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స ని

రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు ఉపాధ్యాయురాలు మృతి
X

దిశ, ఇల్లెందు: పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఓ ప్రైవేటు బస్సు ఢీకొని ప్రైవేటు ఉపాధ్యాయురాలు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. మండలంలోని సిఎస్పీ బస్తీకి చెందిన రహీముద్దీన్- సుహాన దంపతుల కుమార్తె జాస్మిన్ జ్వరం రావడంతో ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం అడ్మిట్ చేశారు. ఇక ఆస్ప‌త్రి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో ప్రైవేటు బస్సు క్రిందపడి ఎండి సుహానా (40) అనే ప్రైవేటు ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story