ఎన్నికల్లో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: ఎస్పీ రోహిత్ రాజు

by Bhanu |   (  Updated:2025-12-13 12:01:11  IST  )

గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు.

ఎన్నికల్లో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి: ఎస్పీ రోహిత్ రాజు
X

దిశ, ఇల్లెందు: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శనివారం ఇల్లెందు పోలీస్ స్టేషన్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో మావోయిస్టుల ఉనికి కనుమరుగైందని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. గంజాయి మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపట్టిన చైతన్యం కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నక్సల్స్ ప్రభావిత రాజకీయ ఘర్షణలు జరిగే ప్రాంతాల్లో జరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాలో గంజాయి రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టామని, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రవాణాపై నిఘా పెట్టామని అన్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిపై చట్టరీత్యా శిక్షలు, వారి ఆస్తులను సైతం జప్తు చేస్తున్నామని అన్నారు.గంజాయిని నిర్మూలించేందుకు నార్కోటిక్ డాగ్స్ ను వినియోగిస్తున్నామని నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ బృందాల ద్వారా గంజాయి గుర్తింపును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొదటిగా నమోదైయిందని తెలిపారు. జిల్లాలో నక్సల్ ప్రభావం పూర్తిగా కోల్పోయిందని లొంగిపోయిన నక్సల్స్ పునరవాసం కల్పించినట్లు తెలిపారు. లొంగిపోయిన నక్సల్స్ క్యాడర్ను బట్టి పునరావాసం ఆర్థిక చేయూతను అందించినట్లు తెలిపారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో వంతెనలు రహదారుల నిర్మాణం చేపట్టేందుకు పంచాయితీ రాజ్ రోడ్లు భవనాల శాఖ పరిధిలో 25 ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు.

జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని గుర్తించామని వారిపై రౌడీషీట్లు తెలుస్తామని, పోలీసులు దొంగలకు నేరస్థులకు ఫ్రెండ్లీ పోలీస్ కాదని శాంతిభద్రతలకు వివాదం కలిగించేవారు. అనంతరం పంచాయతీ ఎన్నికల సందర్భంగా.. ఇల్లెందు సబ్ డివిజన్ పరిధి పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో తీసుకోవలసిన జాగ్రత్తలను బందోబస్తు పై సమీక్షించారు. ఈ సమావేశంలో డి.ఎస్.పి చంద్ర భాను, సీఐలు తాటిపాముల సురేష్, బత్తుల సత్యనారాయణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story