ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి బూతు పురాణం.. బట్ట లూడుతాయ్ అంటూ..

by Dishafeatures2 |
ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి బూతు పురాణం.. బట్ట లూడుతాయ్ అంటూ..
X

దిశ, కూసుమంచి: ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు. సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం భారతదేశమంతటా అమలులోకి తెచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమాచారాన్ని పొందవచ్చు. దీనిలో భాగంగానే కూసుమంచి మండలం, జీళ్లచెరువు గ్రామ పంచాయతీ సమాచారం ఇవ్వమని సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగాము. కానీ సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయటంలో అధికార పార్టీ ముందుంది.

అధికార పార్టీకీ చెందిన ఇంటూరి శేఖర్ నాయకుడు అనే వ్యక్తి తన పక్కన ఎమ్మెల్యే ఉన్నాడని అధికార గర్వంతో ఆర్టీఐ వేయడానికి నువ్వు ఎవర్రా, నేను అంటే ఎవరనుకుంటున్నావ్, బట్టలు విప్పించి కొట్టిస్తా, నీకు ఏమీ హక్కు ఉందిరా అని నువ్వు సమాచారం కోసం ఆర్టిఐ చేస్తున్నావు, అని దరఖాస్తు దారుడు సురేష్‌పై దుర్భాషలు ఆడుతూ, పచ్చి బూతులు మాట్లాడాడు. 'చూడరా నిన్ను దేంట్లో ఒకదాంట్లో కచ్చితంగా ఇరికిస్తా' అంటూ ఫోన్‌లోనే సీఐకి హుకుం జారి చేయటం అధికార పార్టీ నాయకులు అధికారులుపై పెత్తనానికి నిదర్శనం, కేసు పెట్టి లోపల వెయ్ అని చెప్పడం, ఇలా భయభ్రాంతులకు గురి చేయడంపై సర్వత్ర అధికార గర్వం కనబడుతోందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని పెళ్లి టీజర్.. సినిమా రేంజ్‌కు తగ్గకుండా!


Next Story

Most Viewed