విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం... హరితహారం చెట్లు నరికివేత

by velandi.Saikiran |

పచ్చదనాన్ని పెంపొందించడం కోసం గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి హరితహారం కార్యక్రమంన్నీ

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం... హరితహారం చెట్లు నరికివేత
X

దిశ, తల్లాడ: పచ్చదనాన్ని పెంపొందించడం కోసం గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి హరితహారం కార్యక్రమంన్నీ చేపట్టింది. అందులో భాగంగా ప్రతి ఏడాది వాన కాలంలో ప్రజలందరినీ భాగస్వాములు చేసి అధికారులు,ప్రజాప్రతినిధులు అందరు కలిసి ప్రభుత్వ ప్రైవేటు ఖాళీ స్థలాలలో తోపాటు పొలాలు చెరువుగట్టు,గుట్టలు తదితర ప్రాంతాలలో అట్టహాసంగా మొక్కలు నాటారు.తీరా అవి పెరిగి పెద్ద అయ్యేసరికి విద్యుత్ అధికారులు విద్యుత్ తీగలకు అడ్డు వస్తున్నాయని కారణంతో వారు అట్టి చెట్లను అడ్డు అదుపు లేకుండా నరికి వేస్తున్నారు.

తల్లాడ మండల పరిధిలోని బిల్లుపాడు గ్రామంలో బీబీ కాలనీ సమీపంలో హరితహారం లో భాగంగా గత పది సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు పెరిగి పెద్దవైనాయి. విద్యుత్ తీగల కు కొమ్మలు అడ్డు వస్తున్నాయనే కారణంతో విద్యుత్ అధికారులు కొమ్మలను నరకకుండా చెట్టు మొదల వరకు నరికి వేసినారు.దీనితో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైనది.అధికారుల నిర్లక్ష్యం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కన్నెత్తి చూడని గ్రామపంచాయతీ అధికారులు

గ్రామంలో గత పది సంవత్సరాల నుంచి పెంచిన హరితహారం చెట్లను విద్యుత్ అధికారులు యదేచ్ఛగా నరికి వేస్తున్న స్థానిక ఎంపీడీవో కానీ పంచాయతీ సెక్రటరీ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. విద్యుత్ శాఖ అధికారుల ఆదేశంతో చిగురించేందుకు వీలు లేకుండా చెట్ల మొదళ్ళ వరకు నరికి వేసినారు. విద్యుత్తు తీగలకు తగిలే కొమ్మలను తొలగించకుండా చెట్లు మొత్తం నరికివేస్తుంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story