MLA Koonanneni : కొత్తగూడెం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి

by Sridhar Babu |   (  Updated:2024-10-26 13:58:44  IST  )

కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Koonanneni Sambasivarao)స్పష్టం చేశారు.

MLA Koonanneni : కొత్తగూడెం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి
X

దిశ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Koonanneni Sambasivarao)స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో (Kothagudem Urban Development Authority) అభివృద్ధి వేగవంతం అవుతుందనే ఉద్దేశంతో గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అధికారులకు పలుమార్లు విన్నవించి వినతి పత్రాలు అందించినట్టు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కొత్తగూడెం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడ) ఏర్పాటు కోసం జీఓ జారీ చేసిందని వివరించారు.

కుడ ఏర్పాటు అయితే నియోజకవర్గ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉంటుందని, పరిశ్రమలు కూడా వస్తాయన్నారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జేఎన్టీయూలా కేఎస్ఎంను అటానమస్ యూనివర్సిటీ చేయాలన్నారు. 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. టూరిజం అభివృద్ధి కోసం జూపార్క్ ను వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. కొత్తగూడెం-పాల్వంచ బైపాస్ రోడ్డు కోసం కోటి రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

Next Story