'నా మీద పోటీ చేసే ఆయన్ను మళ్లీ ఓడిస్తా..'

by Disha Web Desk 20 |
నా మీద పోటీ చేసే ఆయన్ను మళ్లీ ఓడిస్తా..
X

దిశ బ్యూరో, ఖమ్మం : తాను లేని సమయం చూసి గజదొంగల్లాగా ఖమ్మంలో దూరారని, కొందరిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నంత మాత్రనా గెలిచినట్లు కాదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం ముస్తఫా నగర్ లో పారా ఉదయ్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పరోక్షంగా మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల పై మంత్రి పువ్వాడ ఫైర్ అయ్యారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ నిన్న బీ ఫార్మ్ తీస్కొడానికి హైద్రాబాద్ పోతే బందిపోటు దొంగల్లా ఖమ్మంలో చొరబడి ఒకరిద్దరిని కాంగ్రెస్ లో చేర్చుకుని అదేదో పెద్ద విజయం అన్నట్లు సోషల్ మీడియాలో పెట్టారని దుయ్యబట్టారు. నా మీద పోటీ చేసిన ఆయనను ఓడించిన.. మళ్ళీ ఒడిస్తా.. అదేం పెద్ద విషయం కాదు.. రానున్న రోజుల్లో అదే జరుగుందని అన్నారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా.. ఎవరెన్ని ఎత్తులు వేసినా చివరకు ఒడేది కాంగ్రెస్ పార్టీ అని, విజయ తీరాన్ని తాకేది గులాబీ పార్టీ అని గుర్తుంచుకోవాలి అని అన్నారు. ఖమ్మం ఒకప్పుడు గొంగళి పురుగులా ఉండేదని, కేవలం 4 ఏళ్లలో సీతాకొక చిలుకలా మర్చామని, అది మీ స్వీయ అనుభవంలో ఉందన్నారు. రాష్ట్రంలో ఏ నగరం బావుంది అంటే టక్కున గుర్తొచ్చేది మన ఖమ్మం నగరమే అని, ఇక్కడ ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించడమే కారణం అని అన్నారు. అనేక రోడ్లు, అనేక డ్రైన్ లు, పార్కులు, క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్ టాయిలెట్స్, ఇంటింటికీ త్రాగునీరు, నిరంతరాయంగా విద్యుత్, రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డ్రైన్ లు ఇలా అనేక పనులు చేసి చూపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మేయర్ నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం మాట్లాడుతూ తమ తుది శ్వాస వరకు అజయ్ తోనే ఉంటామని వెల్లడించారు. చిల్లర రాజకీయాలు చేసి డబ్బులు పెట్టి కొంటాం అంటే ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరన్నారు.

వీడీఓస్ కాలనీలో..

ఆడిటర్ శివరామ కృష్ణ ప్రసాద్ అధ్వర్యంలో వీడీఓస్ కాలనీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. నగరాభివృద్ధే ఏకైక లక్షంగా పనిచేస్తున్నానని, ఇక్కడే ఉన్నా.. ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. కానీ ఇక్కడికి వచ్చే వారికి ఖమ్మం ఒక ఆప్షన్ మాత్రమే.. వేరే దిక్కుల సీట్లు, అవకాశాలు రాకపోతే ఖమ్మం వైపు చూస్తారని తాను ఎప్పుడూ అలా చేయలేదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.


పువ్వాడ సతీమణి ప్రచారం..

ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ హ్యాట్రిక్ విజయాన్ని కాంక్షిస్తూ గెలుపే లక్ష్యంగా ఖమ్మం నగరంలో ఆయన సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి ప్రచారం నిర్వహించారు. 13వ డివిజన్ లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. ఓట్లు అభ్యర్థించారు.


Next Story