- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేనున్నా.. మంత్రి పొంగులేటి కొండంత భరోసా
దిశ, ఖమ్మం రూరల్ : అధైర్య పడవద్దు విజయం మనదే మీ వెంట నేనున్నా అంటూ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ

దిశ, ఖమ్మం రూరల్ : అధైర్య పడవద్దు విజయం మనదే మీ వెంట నేనున్నా అంటూ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొండాపురం కాంగ్రెస్ శ్రేణులకు అభయం ఇచ్చారు. ఈ మేరకు ఖమ్మం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసిన వారితో ముచ్చటించారు. అక్కడ ఉన్న గెలుపు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎన్నికలలో చేపట్టాల్సిన వ్యూహాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే స్థలం లేని పేదలకు స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత తనదేనన్నారు. పొన్నెకల్లు నుంచి చేగొమ్మ రోడ్డు పూర్తి చేపిస్తానని తెలిపారు. అలాగే గ్రామంలోని ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేపిస్తానన్నారు. సాక్షాత్తు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఈ భరోసాలతో కాంగ్రెస్ శిబిరంలో జోష్ వచ్చినట్టయింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దండ్యాల వెంకటేశ్వర్లు (డివి), నాగండ్ల శ్రీను, భాస్కర్, కార్యకర్తలు పాల్గొన్నారు.






