- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారుణ్య నియామకాలపై కీలక ఒప్పందం
గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య నియామకాల్లో పట్టభద్రులైన అభ్యర్థులకు క్లరికల్ గ్రేడ్-3 పోస్టులన

దిశ, కొత్తగూడెం: గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య నియామకాల్లో పట్టభద్రులైన అభ్యర్థులకు క్లరికల్ గ్రేడ్-3 పోస్టులను ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించిన నేపథ్యంలో సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ ఎన్.బలరామ్, డైరక్టర్(పా) గౌతమ్ పొట్రుల ఆదేశాల మేరకు సింగరేణి ప్రధాన కార్యాలయ జిఎం(పర్సనల్) ఐఆర్ &పిఎం ఛాంబర్ లో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తో యాజమాన్యం ద్వైపాక్షిక ఒప్పందం చేసుకుంది. సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ బలరామ్ ఆదేశాల మేరకు సింగరేణి యజమాన్యం, గుర్తింపు సంఘం(ఏఐటియూసి) మధ్య ద్వైపాక్షిక ఒప్పంధం జరిగింది.
2009 లో జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం టెక్నికల్ డిగ్రీలైన మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా(మైనింగ్ / మెకానికల్ / ఎలక్ట్రికల్), ఐటీఐ(ఎలక్ట్రికల్/ ఫిట్టర్/వెల్డర్) కోర్సులతో పాటు తాజాగా ఈ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం డిగ్రీ అర్హతను కూడా చేర్చి గ్రేడ్ -3 క్లర్కు ఉద్యోగాలను కల్పించడానికి నిర్ణయించడం జరిగింది. అయితే గని ప్రమాధం లో మరణించిన ఉద్యోగి కుటుంబంలో అర్హులైన టెక్నికల్ డిగ్రీ ఉన్న వారసులు లేనిపక్షంలోనే ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారిని గ్రేడ్ 3 క్లర్కు పోస్టు కు అర్హత కలిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సంస్థలో గ్రేడ్ 3 క్లర్కు పోస్టుల లభ్యతను బట్టి కంపెనీ వీరికోసం నిర్వహించే ప్రత్యేక పరీక్షలో డిగ్రీ అర్హత గల వారసులు పాల్గొనాల్సి ఉంటుందని పరీక్షలో పాసైన వారు మాత్రమే గ్రేడ్ 3 క్లర్కు పోస్టుల నియామకానికి అర్హత సాధిస్తారు.
గ్రేడ్ 3 క్లర్కు పోస్టుల అర్హత పరీక్షలో ఉత్తీర్ణులు కాని వారసులను క్యాటగిరి ఒకటి జనరల్ అసిస్టెంట్ గా గుర్తిస్తూ ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో సింగరేణి యజమాన్యం తరపున జిఎం(పర్సనల్) ఐఆర్ &పిఎం కవితా నాయుడు, జిఎం(యూజి) వై.రాఘు రామి రెడ్డి, జిఎం(హెచ్‌ఆర్‌డి) వెంకట రామి రెడ్డి, జిఎం(సివిల్) డి.వెంకటేశ్వర్లు, గుర్తింపు సంఘం (ఏఐటియుసి) తరపున అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ కే.రాజ్ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కే.సారయ్య, వై.వి.రావు, ఏజిఎం(పర్సనల్) కే.అజయ్ కుమార్, ఏఐటియూసి కేంద్ర ఉపాధ్యక్షులు వంగ వెంకట్, కార్పొరేట్ బ్రాంచ్ సెక్రటరీ ఎస్.రమణ మూర్తి పాల్గొన్నారు.






