అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ర్యాలీ

by velandi.Saikiran |

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని బురద రాఘవాపురం ఉన్నత పాఠశాల లో విద్యార్థులు, ఉపాధ్యాయులు

అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ర్యాలీ
X

దిశ , ఏన్కూర్ : అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పురస్కరించుకొని బురద రాఘవాపురం ఉన్నత పాఠశాల లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంట్లో అందరూ అక్షరాస్యతను సాధించాలని ,ఇల్లాలు చదివినట్లయితే ఇంటిల్లిపాదికి ఉపయోగం ఉంటుందని తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, అక్షరాస్యతను ప్రోత్సహిద్దాం నిరక్షరాస్యతను నిర్మూలిద్దామ‌ని పిలుపునిచ్చారు. అక్షరమే ఆస్తి అక్షరమే శక్తి అంటూ స్లొగన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం నాగిరెడ్డి, ఉపాధ్యాయులు సాగి సుజాత, పొట్ట రామారావు, నాగేశ్వరరావు, విజయశ్రీ, శ్రీనివాసరావు, భావ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story