ఖమ్మం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తా

by Sridhar Babu |   (  Updated:2023-12-03 12:23:19  IST  )

ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నా అని పువ్వాడ అజయ్​ అన్నారు.

ఖమ్మం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తా
X

దిశ, ఖమ్మం సిటీ : ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నా అని పువ్వాడ అజయ్​ అన్నారు. తనపై గెలుపొందిన తుమ్మల నాగేశ్వరరావుకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికలలో గెలుపు, ఓటములు సహజం అని, దాన్ని స్పోర్టివ్ గా తీసుకుని ముందుకు పోతానని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రలో అత్యధిక స్థానాలను గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న దరిమిలా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నా అన్నారు. తన విజయాన్ని కాంక్షిస్తూ ఇప్పటి వరకు పని చేసిన పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, మీడియా, అభిమానులకు పేరు పేరును ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story