ఇంటి నెంబర్ల లొల్లి.. ఎప్పుడు తీసేస్తారో తెలియక తికమక పడుతున్న ప్రజలు

by Ajay Maddhiboyina |

ఖమ్మం నగరపాలక సంస్థ అధికారులు ఎప్పుడు ఇంటి నెంబర్ తీసేస్తారో, ఎప్పుడు ఉంచుతారో తెలియని పరిస్థితి నెలకొంది.. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా ఇంటి నెంబర్లకు దరఖాస్తు చేసుకున్న వారికి నెంబర్లతో పాటు ఇంటి పన్నును ఖరారు చేశారు.

ఇంటి నెంబర్ల లొల్లి.. ఎప్పుడు తీసేస్తారో తెలియక తికమక పడుతున్న ప్రజలు
X

దిశ ఖమ్మం కార్పొరేషన్ : ఖమ్మం నగరపాలక సంస్థ అధికారులు ఎప్పుడు ఇంటి నెంబర్ తీసేస్తారో, ఎప్పుడు ఉంచుతారో తెలియని పరిస్థితి నెలకొంది.. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా ఇంటి నెంబర్లకు దరఖాస్తు చేసుకున్న వారికి నెంబర్లతో పాటు ఇంటి పన్నును ఖరారు చేశారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత చూస్తే తన ఇంటి నెంబర్లు ఆన్ లైన్‌లో డీ ఆక్టివేటివ్ గా కనిపించడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. తమ ఇంటి ఇంటి నెంబర్లు ఎందుకు తీసేశారో తెలవక తికమక పడుతున్నారు. కొంతమందికి తమ ఇంటి నెంబర్లు తీసేశారని తెలవకపోవడం గమనార్హం. నగర శివారులోని ఎనిమిదో డిజన్ పరిధిలోని వైఎస్సార్ కాలనీలో సుమారు ఏడాదిన్నర క్రితం అధికారులు సిబ్బంది కలిసి ఒక క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మించుకున్న వారందరికీ ఇంటి నెంబర్లు ఇచ్చారు. వారు ఇంటిపన్నులు కూడా చెల్లించారు. కాగా ప్రస్తుతం ఇప్పుడు చూస్తే వారి ఇంటి నెంబర్లు డియాక్టివ్ లో ఉన్నాయి. దీంతో వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి.

సెల్ఫ్ అసెస్మెంట్లకు అనుమతినిచ్చి

ఇంటి నెంబర్లు, ఇంటి పన్ను కోసం కార్యాలయాలు చుట్టూ తిరగకుండా గత ప్రభుత్వం సెల్ఫ్ అసెస్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాని ప్రకారం లబ్ధిదారులే తమ ఇంటి కొలతలను ఆన్‌లైన్ చేసుకుంటే వెంటనే ఎంత పన్ను చెల్లించాలో వస్తుంది. దీని ప్రకారం ఆన్‌లైన్‌లోనే పన్ను చెల్లించవచ్చు. అయితే ఇప్పుడు అసెస్మెంట్ చేసిన ఇంటి నెంబర్లను డి యాక్టివేట్ చేసి వివరాలు తొలగించడంతో వారంతా గందరగోళ పడుతున్నారు. ఇంటి నెంబర్ లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు.

అధికారులు ఏమంటున్నారంటే..

గతంలో నకిలీ పత్రాలో సెల్ఫ్ అసెస్మెంట్లు చేసుకున్నారని, ఈ మేరకు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్న వారి నెంబర్లను ఉన్నతాధికారి తొలగించారని, మళ్లీ దరఖాస్తు చేసుకుంటే విచారణ చేసి ఉంటే నెంబర్ ఇస్తామని చెబుతున్నారు. అయితే అసలు పట్టాలు ఉన్నవారు ఇంటి నెంబర్లను తొలగించటంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలైన పట్టా ఉన్నవాళ్ల ఇంటి నెంబర్లను తిరిగి పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Next Story