- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమయానికి స్పందించిన నాలుగో సింహానికి సత్కారం
by velandi.Saikiran |
అదోక మైనారిటీ గురుకుల బాలికల కళాశాల.. ఉదయాన్నే వంటశాలలో వంట మనుషులు ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమే

X
దిశ, డోర్నకల్: అదోక మైనారిటీ గురుకుల బాలికల కళాశాల.. ఉదయాన్నే వంటశాలలో వంట మనుషులు ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమే ఉన్నారు. ఇంతలోనే అనుకోని అతిథిగా ఓ పెద్ద పాము వంటశాలలోకి దూరింది.గమనించిన వంటశాల సిబ్బంది వెంటనే కేకలేయటంతో, పోలీసులకు సమాచారం అందించింది కళాశాల సిబ్బంది. హుటాహుటిన స్పందించిన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీసులు, స్నేక్ క్యాచర్ కు నిమిషాల్లో సమాచారం అందించి పిలిపించారు. అనంతరం పామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఇక సమయానికి స్పందించిన హెడ్ కానిస్టేబుల్ రామన్న, కానిస్టేబుల్ వీరన్నను శుక్రవారం కాలేజీ ప్రిన్సిపాల్ దాసరి స్వప్న, సిబ్బంది పోలీస్ స్టేషన్ లో శాలువాతో సత్కరించారు.
Next Story






