అందరికీ దసరా శుభాకాంక్షలు : ఎమ్మెల్యే సండ్ర

by Disha Web Desk 15 |
అందరికీ దసరా శుభాకాంక్షలు  : ఎమ్మెల్యే సండ్ర
X

దిశ,తల్లాడ : మండలంలోని రంగం బంజార గ్రామంలో దేవీ నవరాత్రులు సందర్బంగా శనివారం ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పూజ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి గ్రామం లో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమం లో ఎంపీపీ దొడ్డ. శ్రీనివాసరావు, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు, బీఆర్​ఎస్​ మండల అధ్యక్షులు రెడ్డం వీరమోహన్ రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్, పట్టణ అధ్యక్షులు జీవీఆర్, ఎంపీటీసీ బానోత్ మోహన్, సర్పంచ్ బాబు, మాజీ సర్పంచ్ లింగా, నాయకులు సాగుర్తి రామారావు పాల్గొన్నారు.

Next Story

Most Viewed