- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓ రైస్ మిల్లులో ఘరానా మోసం
దిశ, కారేపల్లి రూరల్ : కారేపల్లి మండలంలో ఓ రైస్ మిల్లులో రైతుల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని ఘరానా మోసానికి

దిశ, కారేపల్లి రూరల్ : కారేపల్లి మండలంలో ఓ రైస్ మిల్లులో రైతుల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని ఘరానా మోసానికి పాల్పడుతున్నాడు రైస్ మిల్లు యజమాని. వడ్లను పట్టించిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయంటూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాను ఆశ్రయించాడు. బాధితుడి కథ ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. సింగరేణి మండలంలో నీ మేకల తండా గ్రామానికి చెందిన భూక్యా కుమార్ నెలరోజుల క్రితం కారేపల్లికి చెందిన రైస్ మిల్లు లో 14 బస్తాలు తీసుకువెళ్లగా.. ఉదయం ఇస్తే సాయంత్రం లోపు తిరిగి ఇచ్చేశాడు. 50 కేజీల బస్తాలు 12 వచ్చాయి. ఇంట్లో పాత బియ్యం ఉండడంతో మిల్లు నుంచి బియ్యం బస్తాలను ఓపెన్ చేయలేదు. బుధవారం ఓపెన్ చేసి చూడడంతో బియ్యం తెల్లగా ఉండడంతో అవి ప్లాస్టిక్ బియ్యం కలిపారని భావించాడు. దీంతో కుమార్ మీడియాకు ఆశ్రయించాడు. జిల్లా అధికారులు ఆ రైస్ మిల్లులోని బియ్యమును పరిశీలించాలని కోరుతున్నాడు. మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.






