ఎవడైతే మాకేంటి...?

by velandi.Saikiran |

మా దందాకు ఎవరు అడ్డు వచ్చినా ఊరుకునేది లేదు... ఎంతటి వారైనా సరే చుక్కలు చూపించక తప్పదు అన్నట్లు ఓ తండ్రి

ఎవడైతే మాకేంటి...?
X

దిశ, కొత్తగూడెం: మా దందాకు ఎవరు అడ్డు వచ్చినా ఊరుకునేది లేదు... ఎంతటి వారైనా సరే చుక్కలు చూపించక తప్పదు అన్నట్లు ఓ తండ్రి కొడుకులు వ్యవహరించిన తీరు అందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. అక్రమ ఇసుక రవాణా నాటుకున్న అటవీ అధికారులకు సైతం చుక్కలు చూపించారంటే వీళ్ళు ఎంతటి ఘనులో అంచ‌నా వేయ‌వ‌చ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

చాతకొండ ముర్రేడు వాగులో నుండి మంగళవారం అర్ధరాత్రి అక్రమంగా సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది... ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్ లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒక ట్రాక్టర్ కు డ్రైవర్ లేడ‌ని స‌మాచారం. దీంతో గతంలో పంచాయతీ ట్రాక్టర్ నడిపిన అనుభవం ఉన్న యువకుడి సహాయంతో ఆ ట్రాక్టర్ ను తరలించే ప్ర‌య‌త్నం చేశారు. ఆ క్రమంలో సదరు ట్రాక్టర్ కు సంబందించిన వ్యక్తి, అతని తండ్రి.... ఆ యువకుడిపై విచక్షణరహితంగా దాడి చేశారు. అనంత‌రం ట్రాక్టర్ ను తీసుకుని వెళ్ళిపోయారు. ఇదంతా ఫారెస్ట్ గార్డ్ సమక్షంలో జరిగిన కూడా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు చేయ‌లేదు. ఈ సంఘ‌ట‌న పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story