భద్రాద్రి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

by velandi.Saikiran |

భద్రాద్రి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. భారీ వర్షాలకు గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో

భద్రాద్రి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
X

దిశ, భద్రాచలం: భద్రాద్రి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. భారీ వర్షాలకు గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులు దాటి ప్రవహిస్తోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు 38.60 అడుగులకు పెరిగిన గోదావరి, 7 గంటలనుండి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు 35.20 అడుగుల వరకూ తగ్గి, 8 గంటల నుండి మళ్ళీ పెరుగుతూ వస్తోంది. రాత్రి 7.22 గంటలకుమొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఆగష్టు 20 న కూడా ఉదయం 8.15 గంటలకు గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

రాత్రి 9 గంటలకు 48 అడుగులకు పెరగడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 52 అడుగుల వరకూ పెరిగి అనంతరం తగ్గిపోయుంది. 10 రోజులు తర్వాత మళ్ళీ ఇప్పుడు గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. ఎగువనున్న కడెం, శ్రీరామ సాగర్ ప్రాజెక్ట్లు, సమ్మక్క బేరేజ్ పూర్తిగా నిండటంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. అలాగే గోదావరి ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి నదులు ఉప్పొంగి గోదావరికి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి బాగా పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి 50 అడుగుల వరకూ పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కాగా ఎటువంటి విపత్తు నైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు కోరారు.

Next Story