- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
job mela : గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం
సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో గల గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే నిమిత్తం ఈనెల 13 న 20 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.

దిశ, భద్రాచలం : సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో గల గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే నిమిత్తం ఈనెల 13 న 20 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో శ్రీరామ లైఫ్ ఇన్సూరెన్స్, మోర్, అపోలో ఫార్మసీ, నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్, పేటిఎం, వరుణ్ మోటార్స్, జీఎంఆర్ కార్గో, ఎల్ఐసీ ఇండియా, గ్లాండ్ ఫార్మా, కేఎస్ టేకర్స్, స్విగ్గి, వంటి కంపెనీలలో
ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ గిరిజన యువత బయోడేటా, ఆధార్ కార్డు, విద్యార్హత పత్రాలు, జిరాక్స్ సర్టిఫికెట్లతో ఈనెల 13న ఉదయం 9:30 గంటలకు గిరిజన భవనం ఐటీడీఏ భద్రాచలం ప్రాంగణం నందు ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆయన కోరారు. అర్హత గల నిరుద్యోగ గిరిజన యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ఇంకా పూర్తి సమాచారం కొరకు 8143840906, 6302608905 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు.
- Tags
- job mela






