- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిమ్మరావుపేట కేంద్రంగా విద్యుత్ సేవలు
విద్యుత్ వినియోగదారుల కష్టాలు తొలగించేందుకు తల్లాడ కేంద్రానికి ఉన్న ఏడిఏ కార్యాలయాన్ని త్వరలో తిమ్మరావుపేట కేంద్రంగా ఏడిఏ కార్యకలాపాలు నిర్వహించుతున్నట్లు తెలిసింది

దిశ, ఏన్కూర్: విద్యుత్ వినియోగదారుల కష్టాలు తొలగించేందుకు తల్లాడ కేంద్రంలో ఉన్న ఏడిఏ కార్యాలయాన్ని త్వరలో తిమ్మరావుపేట కేంద్రంగా ఏడిఏ కార్యకలాపాలు నిర్వహించుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా తల్లాడలో ఉన్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయం సైతం తిమ్మారావుపేటలో ఏర్పాటు చేస్తున్నారు. గతంలో తల్లాడ ఏడిఏ పరిధిలో ఉన్న ఏన్కూరు మండలం ఇకనుంచి తిమ్మారావుపేట ఏడిఏ పరిధిలోకి రానుంది. కారేపల్లి, చీమలపాడు, ఏనుకూరు, కలిపి తిమ్మరావుపేట ఏడిఏ పరిధిలో సేవలందించుబోతున్నారు. అదేవిధంగా కరెంటు బిల్లుల ఎగువ తగువ, వ్యత్యాసాలతో పాటు ఇతర వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకుగాను తల్లాడలో ఉన్నా ఈఆర్వో కార్యాలయం తిమ్మరావుపేటలో ఏర్పాటు చేస్తున్నారు.
అంతా బాగున్నప్పటికీ ఏన్కూర్ సర్కిల్‌ను తిమ్మారావుపేట ఏన్కూర్ సర్కిల్‌గా రెండుగా విభజించేది ఎప్పుడు అని స్థానికుల ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ ఏన్కూరు సెక్షన్‌గా ఉండటం వల్ల విద్యుత్ శాఖ ఏఈకి పనిభారం ఎక్కువ కావడంతో విద్యుత్ అంతరాయం జరిగితే పరిష్కారానికి సమయం ఎక్కువ అవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు, ఏన్కూర్ సెక్షన్ కింద ఏనుకూరు, నాచారం సబ్ స్టేషన్ పరిధిలోకి వస్తే, తిమ్మరావుపేట సెక్షను, తిమ్మరావుపేట, జన్నారం సబ్ స్టేషన్ పరిధిలోకి రావడం జరుగుతుందని, సెక్షన్లకు విభజించడం వల్ల ఉద్యోగులకు పనిభారం సులభతరం అవుతుందని ఆ విధంగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఏన్కూరును రెండు సెక్షన్లుగా విభజించాలని స్థానికులు కోరుతున్నారు.
- Tags
- khammam






