అక్రమ మద్యాన్ని పట్టుకున్న ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్

by Disha Web Desk 11 |
అక్రమ మద్యాన్ని పట్టుకున్న ఎన్నికల  ఫ్లయింగ్ స్క్వాడ్
X

దిశ, ఖమ్మం సిటీ; ఖమ్మం నగరంలో అక్రమ మద్యాన్ని అమ్ముతున్న అజ్మీరా రమాదేవి అనే మహిళను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. హొలీ పర్వదినం సందర్భంగా నగరంలో మద్యం అమ్మకాలు జరపకూడదని పోలీస్ శాఖ ఆదేశాలు దిక్కరణ, ఎన్నికల నియమావళి ఉల్లంఘన నేపథ్యంలో బెల్టు దుకాణం లో అక్రమంగా అమ్ముతున్న మద్యాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సీజ్ చేశారు. సుమారు రూ.16480 విలువ చేసే 120 బాటిళ్ల మద్యాన్ని పట్టుకున్నట్లు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి రామ్ గోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.


Next Story