సీపీఐ జిల్లా కార్యదర్శిగా దండి సురేష్

by Chintha Aamani |

గత రెండు రోజుల పాటు మధిరలో జరిగిన 23వ మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి.

సీపీఐ జిల్లా కార్యదర్శిగా దండి సురేష్
X

దిశ, ఖమ్మం రూరల్ : గత రెండు రోజుల పాటు మధిరలో జరిగిన 23వ మహాసభలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. మహాసభలలో 91 మందితో కౌన్సిల్ ను 29 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు కార్యదర్శిగా దండి సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దండి సురేష్ ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం గ్రామంలో సాంప్రదాయ కమ్యూనిస్టు కుటుంబం లో జన్మించారు. విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ లో పనిచేసిన సురేష్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేశారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ 23వ మహాసభలో కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

సహాయ కార్యదర్శిగా ఎన్నికైన జితేందర్ రెడ్డి చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలో జన్మించారు విద్యార్థి యువజన ఉద్యమాలలో పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం లో సుదీర్ఘకాలం జిల్లా రాష్ట్ర బాధ్యతలను నిర్వర్తించారు ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పనిచేస్తున్నారు, వీరిద్దరు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు భాగం హేమంతరావు మహమ్మద్ మౌలానా, ఏదులాపురం సిపిఐ నాయకులు,తదితరులు నూతన నాయకత్వాన్ని అభినందించారు.

Next Story