కుదిరితే పొత్తు.. కుదరక పోతే ఒంటరి

by velandi.Saikiran |

CPM స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నించడం, లేని పక్షంలో ఒంటరిగా పోటీ

కుదిరితే పొత్తు.. కుదరక పోతే ఒంటరి
X

దిశ, కొణిజర్ల: స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలతో పొత్తు కోసం ప్రయత్నించడం, లేని పక్షంలో ఒంటరిగా పోటీ చేసేందుకు సైతం సీపీఎం సిద్ధమవుతోంది. మండలంలో వివిధ గ్రామాలలో పార్టీ శాఖలను కలిగిన సీపీఎంకు ఓ మోస్తరు ఓటు బ్యాంకు కలిగి ఉంది. కాసారం, చిన్న మునగాల, గోపవరం, లక్ష్మీపురం, సింగరాయపాలెం, కొణిజర్ల, తనికెళ్ళ, అమ్మపాలెం, చిన్నగోపతి తదితర గ్రామాల్లో పార్టీ కార్యకర్తల బలం ఉండడంతో పాటు మండల స్థాయి నాయకత్వం ఉంది.

దీంతో ఆ పార్టీ జడ్పీటీసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన సంసిద్ధతన వ్యక్తం చేస్తోంది. కలిసొచ్చే పార్టీలతో పొత్తు కుదుర్చుకోవటం, కుదరని పక్షంలో ఒంటరిగా పోటీ చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2019 మేలో జరిగిన ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలు కలిసి పోటీ చేశాయి. ఈసారి కూడా రెండు వామపక్ష పార్టీలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ సీపీఎం ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి ఉత్పన్నమైతే జడ్పీటీసి ఎస్టీ జనరల్ కావడంతో ఆ పార్టీ తరఫున పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం పేరు ఖరారు అయ్యే అవకాశం ఉంది.

Next Story