18న పాలేరుకు సీఎం రేవంత్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 18న ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు.

18న పాలేరుకు సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, ఖమ్మం రూరల్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 18న ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను మద్దులపల్లిలో వర్చువల్ గా చేయనున్నారు. ఈ పర్యటనను పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కోరారు.

అభివృద్ధి పనుల వివరాలు..

కూసుమంచి : 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన.

మద్దులపల్లి : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్, న‌ర్సింగ్ కాలేజీ ప్రారంభోత్సవం.

లింక్ కెనాల్ : మున్నేరు - పాలేరు లింక్ కెనాల్ (గ్రావిటీ పథకం) నిర్మాణ పనులకు శంకుస్థాపన. అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు.

భారీగా తరలిరావాలని పొంగులేటి పిలుపు..

ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలకు ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి పొంగులేటి కోరారు.

Next Story