- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాలువ పునరుద్ధరణ పనులు వేగంగా చేయాలి
by Sridhar Babu |
కాలువ పునరుద్ధరణ పనులు వేగంగా చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశించారు.

X
దిశ, కూసుమంచి : కాలువ పునరుద్ధరణ పనులు వేగంగా చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశించారు. మండలంలోని పాలేరు రిజర్వాయర్ సమీపంలో హఠ్యతండాకు వెళ్లే రోడ్డు వద్ద సాగర్ ఎడమ కాలువకు ఇటీవల కురిసిన వర్షాలతో గండి పడింది. దాంతో రైతుల పొలాలు నీటమునిగి ఇసుక మేటలు వేశాయి. ఈ కాలువ మరమ్మతు పనులను అధికారులు చేపట్టగా శుక్రవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పరిశీలించారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులను పనులపై ఆరా తీశారు. వీలైనంత తొందరగా కాలువ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని కోరారు. ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు.
Next Story






