- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అశ్వారావుపేట మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకోవాలి
అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 22 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

దిశ, అశ్వారావుపేట: అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 22 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం అశ్వారావుపేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని కాసాని నాగశేష పద్మ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు తో కలిసి మున్సిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ ఉప్పల వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు.
వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయబోయే అభ్యర్థులను ఆయన పరిచయం చేసుకుని, వారితో ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో, మెచ్చా నాగేశ్వరరావు కృషితో అశ్వారావుపేట మున్సిపాలిటీగా మారిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ పార్టీ తరుపున పోటీ చేసే వారు అందరూ విజయం సాధించడం ఖాయమన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట దమ్మపేట మండల అధ్యక్షులు జుజురి వెంకన్నబాబు, దొడ్డ రమేష్ తోపాటు పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






