జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో భరత్ విద్యార్థులు

by velandi.Saikiran |

డిసెంబర్ 20, 21న జ‌రిగిన‌ ఖమ్మం జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నందు మధిర కు చెందిన భరత్ విద్యానికేతన్ విద్యార్థులు 5 అంశ

జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో భరత్  విద్యార్థులు
X

దిశ మధిర : డిసెంబర్ 20, 21న జ‌రిగిన‌ ఖమ్మం జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ నందు మధిర కు చెందిన భరత్ విద్యానికేతన్ విద్యార్థులు 5 అంశాల్లో పాల్గొన్నారు . తొమ్మిదవ తరగతికి చెందిన జి. మానస, వేమిరెడ్డి రేణు శ్రీ,, శీలం సాయి ప్రణీత, పదోవ తరగతికి చెందిన వినయ్, జితేంద్ర, నిఖిల్ రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. వారు తయారు చేసిన జనతా కూలర్, కిడ్నీలు పనిచేసే విధానం, కాలుష్య నివారణ, తదితర అంశాలపై తయారుచేసిన వైజ్ఞానిక ప్రదర్శనలు పలువురు విద్యావేత్తల ప్రశంసలు పొందారు.. ఈ అంశాలు తయారు చేసిన విద్యార్థులను వారికి సహకరించిన ఉపాధ్యాయులు షేక్ పాషా, త్రివేణి, పూజిత, నీలిమ,తదితరులను భరత్ విద్యాసంస్థల డైరెక్టర్, కరస్పాండెంట్ శీలం విద్యాలతా వెంకట్ రెడ్డి, ప్రిన్సిపాల్ జింకల కోటేశ్వరరావు ఇంచార్జి ప్రిన్సిపాల్ క. రవీందర్ రెడ్డి లు అభినందించారు.

Next Story