- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టుబడిన వాహనాలకు రేపు వేలం
by velandi.Saikiran |
వివిధ కేసులలో పట్టుబడిన 06 వాహనాలను సెప్టెంబర్ 10న ఉదయం 11 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎక్సైజ్

X
దిశ, పాల్వంచ టౌన్: వివిధ కేసులలో పట్టుబడిన 06 వాహనాలను సెప్టెంబర్ 10న ఉదయం 11 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఎక్సైజ్ స్టేషన్ లో వేలం వేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమీషనర్ జి. జనార్థన్ రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. వేలం వేయు వాహనాలు బజాజ్ ఆటో, హీరో హోండా ప్యాషన్ ప్రో, హోండా షైన్ సిబి 125, హీరో స్ప్లెండర్ ప్లస్,కెటిఎమ్ బైక్, హెచ్ఎఫ్ డీలక్స్, రోడ్డు వర్తి కండిషన్ లో ఉన్నట్లు తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి గలవారు నిర్ణీత 25 శాతం ఈఎండి ధరావతు డబ్బులు డిపాజిట్ చేసి రసీదు తీసుకోవాలని, బహిరంగ వేలం బుధవారం జరుగుతుందని, మరిన్ని వివరాలకు కార్యాలయ పని వేళల్లో మధ్య నిషేధ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలని డిప్యూటీ కమీషనర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Next Story






