విలువలు కోల్పోతున్న ఏసీబీ అధికారులు..: కనగాల అనంత రాములు

by Chintha Aamani |

పాల్వంచ మున్సిపాలిటీ లో జరిగిన ఏసీబీ దాడులు పిచుక మీద బ్రహ్మాస్త్రం చేసినట్లు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కనగాల అనంత రాములు అన్నారు.

విలువలు కోల్పోతున్న ఏసీబీ అధికారులు..: కనగాల అనంత రాములు
X

దిశ,పాల్వంచ : పాల్వంచ మున్సిపాలిటీ లో జరిగిన ఏసీబీ దాడులు పిచుక మీద బ్రహ్మాస్త్రం చేసినట్లు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కనగాల అనంత రాములు అన్నారు.ఆదివారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ నేను మీడియా ముఖంగా చెప్తున్నా ప్రభుత్వ,ఏసీబీ అధికారులకు చేసే వృత్తి పట్ల చిత్తశుద్ధి,నిబద్ధత నిజంగా ఉంటే పాల్వంచ మండల రెవెన్యూ కార్యాలయ రికార్డులను పరిశీలించండి, వందల ఎకరాల ప్రభుత్వ,దేవాదాయ,ఇరిగేషన్,ఫారెస్ట్ భూములు నేటికి అన్యాక్రాంతం అవుతూనే వస్తున్నాయి..ప్రతిరోజు ఏదో ఒక పత్రికల్లో వస్తున్న ఏ ఒక్క అధికారి కూడా అటువైపు ఆలోచన చేయకపోవడం వెనుక ఏం జరుగుతుందో ఇట్టే అర్థం అవుతుంది అని అన్నారు. మాజీ ప్రజా ప్రతినిధి మొదలుకొని పట్టణంలో అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు,రాజకీయ నాయకులు కబ్జాలకు పాల్పడుతూ దోచుకు తింటున్నారు.రెవెన్యూ రికార్డులను మార్చి మరీ ఈ తతంగం అంతా చేస్తున్నా నేటి వరకు ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అన్నారు.

ఉదాహరణకు మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అతని అనుచరులు చేసిన భూ కబ్జాలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి అయినా ఏ ఒక్క ప్రభుత్వ అధికారి వాటి మీద కనీస విచారణ చేపట్టకపోవడం ప్రజలకు పెద్ద ప్రశ్నగా మారిందని, ప్రభుత్వ,చెరువు శిఖం,దేవాదాయ,అటవీ భూములలో యథేచ్ఛగా బహుళ అంతస్తులు,రిసార్టులు,ఫంక్షన్ హాలులు నిర్మిస్తున్న అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా లేక కబ్జాకోరులకు లొంగి దాసోహం అంటున్నారా అని ఆయన ప్రభుత్వ అధికారులను సూటిగా ప్రశ్నించారు..

మాజీ ఎమ్మెల్యే హయాంలో మున్సిపాలిటీలో భారీ కుంభకోణం..

మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హయాంలో అప్పటి మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్ చేసిన కుంభకోణాలు అన్ని ఇన్ని కావని కుక్కలకు ట్యూబెక్టమీ పేరుతో యాభై లక్షల నిధుల మాయం అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త పేరుతో సుమారు కోటి యాభై లక్షలు హరితహారం పేరుతో చేసిన దోపిడీ అంతా ఇంతా కాదని ఇవన్నీ పలు మార్లు నేను వెలుగులోకి తీసుకు వచ్చినా ఏ ఒక్క అధికారి ఎటువంటి విచారణకు గాని చర్యలకు గాని పూనుకోలేదని అన్నారు.ఇప్పటికైనా అధికారులకు చెప్పేది ఒక్కటే చిత్తశుద్ధి, నిబద్ధత ఉంటే ప్రత్యక్షంగా రండి నా దగ్గర ఉన్న సమాచారం అందిస్తా పూర్తి విచారణ చేపట్టి ఎంతో విలువైన భూములను రక్షించడం తో పాటు అవినీతి తిమింగలాలను గుర్తించి చర్యలు తీసుకోండి అంతే కానీ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేదు అనే అపవాదు ఎక్కడ వస్తుందో అనే అభద్రతా భావంతో మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగుల జేబుల్లో ఉన్న చిల్లర నగదును చూపిస్తూ ఉనికిని కాపుడుకొనే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేశారని అన్నారు.

టౌన్ ప్లానింగ్,ఇరిగేషన్,రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు..

కళ్ళముందే ప్రభుత్వ,ఇరిగేషన్ భూముల్లో బహుళ అంతస్తులు,రిసార్టులు వెలుస్తున్నాయి అని ప్రతి రోజు పత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి.444,817,727,999..ప్రభుత్వ సర్వే నంబర్లలో అనేక అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి..మేడికుంట,రాతిచెరువు,చింతల చెరువు లు కాలువలతో సహా కబ్జాకోరుల కబంధ హస్తాల్లో చిక్కుకు పోయి చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయ మవుతున్నాయి..ఇవన్నీ అధికారులకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాల్వంచను ప్రక్షాళన చేయాలని కోరారు.ఏసీబీ అధికారులను నేరుగా ఒక్క మాట అడుగుతున్నా ఈ ప్రెస్ మీట్ ను సుమోటోగా తీసుకుని చేసినా లేక నేరుగా ఫిర్యాదు చేయమన్నా చేస్తా మండల రెవెన్యూ కార్యాలయంలో రికార్డుల తారుమారుపై భూ కబ్జాలపై విచారణ చేపట్టి ప్రజలకు ఒక భరోసా కల్పించాలని కోరారు.అంతే కానీ చిత్తశుద్ధితో పనిచేస్తున్న చిన్న పాటి ఉద్యోగులపై బ్రహ్మాస్త్రం ఉపయోగించ కూడదని అన్నారు.ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సొసైటీ డైరెక్టర్ మైనేని బాబు,సొసైటీ డైరెక్టర్లు జరబన సీతారాం బాబు,సుధాకర్, బత్తిన దుర్గారావు గౌడ్ నాయకులు రేగల్ల శ్రీను,చండ్ర రవి తదితరులు పాల్గొన్నారు.

Next Story