మేడారం వెళ్తున్న కారు.. అర్ధరాత్రి బీభత్సం

by Ratna Kumari |   (  Updated:2026-02-08 04:27:05  IST  )

మేడారం వెళ్తున్న కారు అర్ధరాత్రి బీభత్సం సృష్టించింది.

మేడారం వెళ్తున్న కారు.. అర్ధరాత్రి బీభత్సం
X

దిశ, ఆళ్లపల్లి : మేడారం వెళ్తున్న కారు అర్ధరాత్రి బీభత్సం సృష్టించింది. మండల పరిధిలోని ముత్తాపురం గ్రామ సమీపంలోని మాడ్షల వాగు సమీపం వద్ద బ్రిడ్జి సైడ్ కాంపౌండ్ వాల్ పిల్లర్లు తగిలి AP29BP4371 నెంబర్ గల కారు అదుపుతప్పి గోతిలో పడిపోయింది. సంఘటన స్థలానికి ఎస్సై సోమేశ్వర్ చేరుకోని విచారణ చేపట్టి కొత్తగూడెం చెందిన బత్తుల రాజు అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి కారులో మేడారం వెళ్తున్నట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తుల ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. కారులో మద్యం మత్తులో ఉన్న వ్యక్తులను అదుపులో తీసుకోని కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ తెలిపారు.

Next Story