- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాద్రిలో 12 వందల విగ్రహాలు నిమజ్జనం
నవరాత్రులు పూజలు అందుకున్న గణనాధులు భద్రాద్రిలోని గౌతమి నదిలో నిమజ్జనం అవుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు

దిశ, భద్రాచలం : నవరాత్రులు పూజలు అందుకున్న గణనాధులు భద్రాద్రిలోని గౌతమి నదిలో నిమజ్జనం అవుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాంచిల పై గణపతి విగ్రహాలను గోదావరి మధ్యలోకి తీసుకుని వెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. గత ఏడాది మొత్తం 1300 గణేష్ విగ్రహాలను భద్రాద్రిలో నిమజ్జనం చేయగా.. ఈ సంవత్సరం 14 వందలకు పైబడి విగ్రహాలు నిమజ్జనం జరగనున్నాయు. శుక్రవారం నాటికి 729 విగ్రహాలను భద్రాద్రిలో నిమజ్జనం చేయగా, శనివారం రాత్రికి 1200 విగ్రహాలు నిమజ్జనం జరిగాయి.
ఆదివారం కూడా నిమజ్జనోత్సవం కొనసాగనుంది. ఇతర ప్రాంతాలనుండి భారీ సంఖ్యలో గణనాధులు భద్రాద్రికి తరలివస్తుండటంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్, రెవిన్యూ, ఇరిగేషన్, పంచాయతీ,విద్యుత్ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎస్ పి రోహిత్ రాజు క్షేత్ర స్థాయిలో నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అధికారులకు భక్త మండల్లు సహకరించాలని, నిమజ్జన వేడుకల్లో డి జే, బాణసంచా నిషేధం అని తెలిపారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సి సి కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






