- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్‌డేట్.. కాసేపట్లో సిట్ విచారణకు ఆర్ఎస్పీ
ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar)కు ఇవాళ సిట్ విచారణకు హాజరుకాబోతున్నారు. అయితే, జులై 14న సిట్ నోటీసులకు ఆయన స్పందించకపోవడంతో మరోసారి ప్రవీణ్ కుమార్‌కు అధికారులు నోటీసులు జారీ చేసి వారంలోగా విచారణకు హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీస్ స్టేషన్‌లోని సిట్ ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు.
కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) తన ఫోన్‌ను ట్యాపింగ్ చేసిందని గతంలో బీఎస్పీ (BSP) స్టేట్ ప్రెసిడెంట్ హోదాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలక్షన్ కమిషన్ (EC)తో పాటు నాటి డీజీపీ (DGP)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే, ఆ కంప్లయింట్ ఆధారంగా ఇవాళ సిట్ అధికారులు ఆయన ఇచ్చే వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ అయినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. రాజకీయాల్లోకి రాక ముందు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ విధులు నిర్వర్తించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ సెక్రటరీగా పనిచేస్తూ 2021 జులైలో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి మాయావతి నాయకత్వంలోని బీఎస్పీలో చేరారు. దీంతో నాటి నుంచి ప్రణీత్ రావు (Praneeth Rao) బృందం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కదలికలను బీఆర్ఎస్ పెద్దలకు తెలియచేస్తూ.. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసింది.






