పెండింగ్ బిల్లులపై నేడు కీలక సమావేశం.. హాజరుకానున్న సీఎం, కేంద్ర మంత్రులు, ఎంపీలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-27 04:23:37  IST  )

కేంద్ర ప్రభుత్వం (Central Government) వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై కీలక సమావేశం జరగనుంది.

పెండింగ్ బిల్లులపై నేడు కీలక సమావేశం.. హాజరుకానున్న సీఎం, కేంద్ర మంత్రులు, ఎంపీలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం (Central Government) వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై కీలక సమావేశం జరగనుంది. ఇవాళ ప్రజా భవన్‌ (Praja Bhavan)లో మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో భేటీని ఏర్పాటు చేశారు. అయితే, మొదట 3 గంటలకు నిర్వహించాల్సిన సమావేశాన్ని సమయాభావ పరిస్థితుల వల్ల మార్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌తో పాటు, ఎంపీలు డీకే అరుణ కుమారి, ధర్మపురి అర్వింద్, గడ్డం వంశీకృష్ణ, కడియం కావ్య, గోడెం నగేశ్, అసుదుద్దీన్ ఓవైసీ, బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందర్ రావు, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘురామరెడ్డి, సురేష్ షెట్కర్, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, సురేష్ రెడ్ది, వద్దిరాజు రవీంద్ర, బండి పార్థసారథి, దామోదర్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు జితేందర్ రెడ్డి, అధికారులు పాల్గొననున్నారు.

ఈ భేటీలో ప్రధానంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్, ప్రజా పంపిణీ వ్యపస్థకు సంబంధించి బకాయిలు, సీఎంఆర్ బకాయిలు, మహిళా, శిశు సంక్షేమ పథకం నిధులు, ఇరిగేషన్‌, పెండిగ్ ప్రాజెక్టుల అనుమతులు, ఆంధ్రప్రదేవ్ పునర్విభజన చట్టం హామీ, ఇతర స్పెషల్ అసిస్టెన్స్, గ్రాంట్ల విడుదలపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.

‘తెలంగాణ రైజింగ్-2047’ అంశంపై భేటీ

ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ‘తెలంగాణ రైజింగ్-2047’ అంశంపై ప్రత్యేక సమావేశం జరగనుంది. అన్ని సంబంధిత మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు, సెక్రటరీలు ఈ సమావేశానికి హాజరవ్వాలనే సూచన జారీ అయ్యాయి. ఈ కార్యక్రమాల నిర్వాహణకు సంబంధించిన వివరాలను సంబంధిత అధికారులకు సమాచారం పంపినట్లుగా వెల్లడించారు. ప్రతినిధులు, అధికారులు తమ ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు.

Next Story