హైకోర్టులో వాదనలు ఏం వినిపించాలి..? సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక భేటీ

by Ramesh Naini |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.

హైకోర్టులో వాదనలు ఏం వినిపించాలి..? సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాసంలో (local bodies) స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల (BC reservations) అంశంపై కీలక నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. (బుధవారం) రేపు తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, వినిపించాల్సిన వాదనలపై చర్చలు జరిపారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు, వివరాలను షేర్ చేశారు. ట్వీట్ ఇదే..

Next Story