తెలంగాణ పోలీసు శాఖలో కీలక పరిణామం.. ఏకంగా 30 మంది ఏఎస్పీలు బదిలీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-22 08:55:48  IST  )

తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department)లో బదిలీ పర్వం కొనసాగుతోంది.

తెలంగాణ పోలీసు శాఖలో కీలక పరిణామం.. ఏకంగా 30 మంది ఏఎస్పీలు బదిలీ
X

దివ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department)లో బదిలీ పర్వం కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 మంది ఏఎస్పీ (ASP)లను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ (DGP Jitender) ఇవాళ మధ్యాహ్నం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రెండు రోజుల క్రితమే 77 మంది డీఎస్పీ (DSP)లు, అదేవిధంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్ల పరిధిలో 27 మంది ఏసీపీ (ACP)లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే, వరుస ట్రాన్స్‌ఫర్లు (Transfers) అటు సంబంధిత శాఖ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.

Next Story