ఇరిగేషన్ శాఖలో కీలక పరిణామం.. పెంటారెడ్డి సేవలు మరో ఏడాది పొడిగింపు

by Kema Shiva Kumar |

తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సలహాదారుగా రిటైర్డ్ అధికారి కె.పెంటారెడ్డి పదవీ కాలాన్ని ఏడాది పాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇరిగేషన్ శాఖలో కీలక పరిణామం.. పెంటారెడ్డి సేవలు మరో ఏడాది పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖలో ఎత్తిపోతల పథకాల (Lift Irrigation Schemes) సలహాదారుగా రిటైర్డ్ జెన్‌కో స్పెషల్ ఆఫీసర్ కె.పెంటారెడ్డి (K Penta Reddy) పదవీ కాలం మరో ఏడాది కాలం పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా జీవో నెం.974ను విడుదల చేసింది. పెంటారెడ్డి నియామకం 16.11.2025 నుంచి 15.11.2026 వరకు అమల్లో ఉండనుండగా.. గౌరవ వేతనం నెలకు రూ.1,50,000 చెల్లించనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ వాహనం, మొబైల్ ఛార్జీలు, అధికారిక పర్యటనల సమయంలో వర్తించే రవాణా, కరువు భత్యాలను (DA) ప్రభుత్వం కల్పించనుంది. ఆయన హైదరాబాద్‌లోని ఇంజనీర్-ఇన్-చీఫ్ (అడ్మిన్) పరిపాలనా నియంత్రణలో విధులు నిర్వర్తించనున్నారు. గతంలో ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను గుర్తించి, నిబంధనల సడలింపుతో ఈ పొడిగింపును మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Next Story