జూబ్లీహిల్స్‌ బైపోల్ వేళ కీలక పరిణామం.. పార్టీ ముఖ్య నేతలతో గులాబీ బాస్ భేటీ

by Kema Shiva Kumar |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పలువురు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

జూబ్లీహిల్స్‌ బైపోల్ వేళ కీలక పరిణామం.. పార్టీ ముఖ్య నేతలతో గులాబీ బాస్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పలువురు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకరావు, సునీతా లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై కేసీఆర్‌ వారితో చర్చించారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ఇంటిటికీ ప్రచారం, జాయినింగ్స్‌పై డిస్కస్ చేశారు.

Next Story