బీఆర్ఎస్‌లో చేరేముందు జీవన్ రెడ్డి ఒకసారి ఆ లిస్ట్ చూడాలి: కాంగ్రెస్ ఎంపీ

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్లకు భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

బీఆర్ఎస్‌లో చేరేముందు జీవన్ రెడ్డి ఒకసారి ఆ లిస్ట్ చూడాలి: కాంగ్రెస్ ఎంపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్లకు భువనగిరి ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బావ హరీష్ రావు మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారని కేటీఆర్ ఏదో ఒకటి చేయాలని జగిత్యాలకు వెళ్లారు. అబద్దాల రావును డ్రామారావు మించిపోయారు’ అని చామల కిరణ్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అవమానాల లిస్ట్ చూడకుండా జీవన్ రెడ్డి కేసీఆర్‌ను కలిశారని, కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి 14 బీ-ఫారాలు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో 50 కౌన్సిలర్ స్థానాలు ఉంటే.. 20 ఆయన మనుషులకు ఇచ్చారు. జగిత్యాల డీసీసీ అధ్యక్ష పదవి ఆయన వర్గానికి ఇచ్చారని ఆయన తెలిపారు. ఒక్క మున్సిపాలిటీ గెలిస్తే కేటీఆర్ సంబరాలు చేసుకోవడానికి వెళ్లారని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 90 మున్సిపాలిటీలు గెలిచిందన్నారు.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందా కేటీఆర్? ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో ఉందని, కేటీఆర్ అబద్దాలు మానుకోవాలని ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి హితవు పలికారు. అవమానాలకు అడ్డా బీఆర్ఎస్ పార్టీ అని, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో తుమ్మల నాగేశ్వరరావుపై కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుని కనీసం సభ్యత్వ నమోదు పుస్తకాలు తుమ్మలకు ఇవ్వలేదని, కొల్లాపూర్‌లో జూపల్లిపై పోటీ చేసి గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని జూపల్లికి సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వకుండా అవమానించారని ఎంపీ చామల విమర్శించారు. కుటుంబ సభ్యుడు హరీష్ రావును మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించారు. కవితను లిక్కర్ కేసు బయటపడక ముందే ఆమెను ఇంట్లో కుటుంబ సభ్యులు అవమానించారు. బీసీ బిడ్డ ఈటల రాజేందర్‌ను అవమానకరంగా బర్తరఫ్ చేయలేదా? అని ఎంపీ చామల ప్రశ్నించారు.

Next Story