ప్రధానికి CM రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతారని భావిస్తున్నా: కిషన్ రెడ్డి

by Disha Web Desk 2 |
ప్రధానికి CM రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతారని భావిస్తున్నా: కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వస్తోన్న సందర్భంగా ప్రొటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతారని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని రాష్ట్రానికి వస్తే స్వాగతం పలికే సాంప్రదాయాన్ని మాజీ సీఎం కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రధాని వస్తే.. గవర్నర్, సీఎం, అధికారులు స్వాగతం పలకడం సాంప్రదాయమని చెప్పారు. ప్రధాని పర్యటనకు ప్రొటోకాల్ ప్రకారం పీఎంవో నుంచి ఆహ్వానాలు ఉంటాయని అన్నారు. కేసీఆర్ తెరలేపిన సాంప్రదాయాన్ని రేవంత్ రెడ్డి కొనసాగించబోరు అని అనుకుంటున్నానని అన్నారు.

కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి ప్రధాని రాష్ట్రానికి వస్తుండటం ఆసక్తిగా మారింది. గతంలో ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా.. ప్రధాని కార్యక్రమాలకు అప్పటి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. సీఎం అయిన తర్వాత తెలంగాణకు వస్తున్న ప్రధాని మోడీని రేవంత్ రెడ్డి స్వాగతం పలికే అవకాశం ఉంది. ఆయనతోపాటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నట్లు సమాచారం. మార్చి 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్న ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు.


Next Story

Most Viewed