Kadiam Srihari: మళ్లీ పోటీ చేసేది నేనే.. రాజీనామాపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-11-22 06:32:39  IST  )

పార్టీ ఫిరాయింపుల విషయంలో తన తుది నిర్ణయం త్వరలోనే వెల్లడిస్తానని కడియం శ్రీహరి చెప్పారు.

Kadiam Srihari: మళ్లీ పోటీ చేసేది నేనే..  రాజీనామాపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయింపులపై (Party defections) స్పీకర్ విచారణ వేగవంతం చేసిన వేళ తన రాజీనామాపై స్టేషన్ ఘన్‍పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ నిర్ణయం మేరకు నా నిర్ణయం ఉంటుందని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు, న్యాయనిపుణులతో ప్రస్తుతం చర్చిస్తున్నానని ఒక వేళ ఉప ఎన్నిక వచ్చినా పోటీ చేసేది నేనే అని ప్రజలు గెలిచించేది కూడా నన్నే అని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన కడియం శ్రీహరి.. నా రాజీనామాపై ప్రతిపక్షాలది అత్యుత్సాహమేనన్నారు. తాను రాజీనామా చేస్తున్నట్లు మీడియాకు ఎక్కడైనా చెప్పానా? రాజీనామాపై పరిస్థితులు, స్పీకర్ నిర్ణయాన్ని బట్టి తన డిసిషన్ ఉండబోతోందన్నారు. ఈ విషయంలో తుది నిర్ణయం త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపులపై ఈ నెల 23 లోపు వివరణ ఇవ్వాలని స్పీకర్ తనకు నోటీసులు ఇచ్చారని ఈ నేపథ్యంలో తాను నిన్న స్పీకర్‍ను కలిసి సమాధానం ఇచ్చేందుకు మరి కొంత సమయం కావాలని కోరినట్టు చెప్పారు. తన విజ్ఞప్తిపై స్పీకర్ సానుకూలంగా స్పందించారని తనకు ఎన్నిరోజుల సమయం ఇస్తారనేది ఇవాళ స్పీకర్ వెల్లడిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story