అమిత్ టికెట్‌పై నాలుగైదు రోజుల్లో క్లారిటీ వస్తుంది: గుత్తా

by Disha Web Desk 2 |
అమిత్ టికెట్‌పై నాలుగైదు రోజుల్లో క్లారిటీ వస్తుంది: గుత్తా
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిష్టానం ఆదేశిస్తే నా కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి బరిలో ఉంటాడని మరోసారి తేల్చి చెప్పారు. అమిత్ టికెట్‌‌పై నాలుగైదు రోజుల్లో క్లారిటీ వస్తుందని తెలిపారు. భువనగిరి, నల్లగొండ స్థానాల్లో ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పారు. నల్లగొండలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తే.. తప్పకుండా బీఆర్ఎస్ నుంచి అమిత్ రెడ్డి బరిలో ఉంటాడని అన్నారు.

తనకు ఇంకా నాలుగు సంవత్సరాలు పదవీ కాలం ఉందని.. అప్పటి వరకు మండలి చైర్మన్‌గా ఉంటానని తెలిపారు. నేను పార్టీపై అసంతృప్తిగా లేనని.. పార్టీ కేడర్‌ను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారిందని అన్నారు. పార్టీ ఓటమికి వ్యక్తులు కారణం కాదు.. వేవ్‌లో కాంగ్రెస్ గెలిచిందని వెల్లడించారు. మంచి పనులు చేసిన మంత్రులు ఓడిపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అమిత్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోయినా పార్టీ మారబోమని స్పష్టం చేశారు. నల్లగొండలో ఎమ్మెల్యేల ఓటమికి నేను కారణం అయితే.. ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఓటమికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు.



Next Story

Most Viewed