- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అది గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపొస్తది: కవిత ఎమోషనల్
అది గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపొస్తది: కవిత ఎమోషనల్

దిశ, వెబ్‌డెస్క్: స్కూల్ డేస్‌లో ఎదుర్కొన్న కొన్ని ఆసక్తికర సంఘటనలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) రివీల్ చేశారు. శనివారం ఓ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినితో మాట్లాడారు. ఈ సందర్భంగా చదువుకునే రోజుల్లో తాను వేధింపులకు గురైనట్లు కవిత తెలిపారు. నల్లగా ఉన్నానని అనేకమంది నన్న ఏడిపించే వారని గుర్తుచేశారు. ఆ సమయంలో చాలా బాధేసేదని చెప్పుకొచ్చారు. అందరం దేవుడు పుట్టించినట్లుగా ఉంటాం.. ఎవరు ఎలా పుట్టాలో ఎవరి చేతుల్లోనూ ఉండదు అని అమ్మ నాలో ధైర్యం నింపుతుండేదని అన్నారు. అసలు మనం ఎలా ఉన్నామనేది కాదని, ఎలా ఆలోచిస్తున్నామనేది.. ఏం సాధిస్తామనేది మన పొజీషన్‌ను డిసైడ్ చేస్తదని వెల్లడించారు.
అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29 దీక్షా దివస్ పురస్కరించుకుని కవిత పెట్టిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ఒక యోధుని దీక్ష.. అమరుల త్యాగం యావత్ తెలంగాణ.. జాతికి మేలుకొలుపైంది, ఐక్యతా గీతమైంది.. ఉద్యమ స్ఫూర్తిని నింపింది.. తెలంగాణ ఉద్యమాన్ని విజయపథం వైపు నడిపింది.. రాష్ట్ర సాధనకు దారి దీపమైంది.. భౌగోళిక తెలంగాణ సాధించాం.. సామాజిక తెలంగాణ సాధిస్తాం అంటూ కవిత ట్వీట్ చేసింది. కవిత తన ట్వీట్‌లో కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా ఒక యోధుని దీక్ష్ అని పేర్కొనడం చర్చనీయాంశమైంది.






