TS DOST 2025 : ఇంటర్ పూర్తైన విద్యార్థులకు BIG అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-22 12:04:46  IST  )

ఇంటర్మీడియట్ పరీక్షలు(Intermediate Exams) విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) చైర్మన్‌ అభినందనలు తెలియజేశారు.

TS DOST 2025 : ఇంటర్ పూర్తైన విద్యార్థులకు BIG అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్‌పై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్మీడియట్ పరీక్షలు(Intermediate Exams) విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) చైర్మన్‌ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ‘మీరు ఇప్పుడు ఉన్నత విద్యలో అడుగుపెట్టబోతున్న కీలక దశలో ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉన్న డిగ్రీ (UG) కోర్సులకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలోని సంప్రదాయ విశ్వవిద్యాలయాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్ పాఠ్యాంశాలు ఆధునికంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్వ్యవస్థీకరించబడ్డాయి. ఈ కోర్సుల్లో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence), డేటా సైన్స్ (Data Science), ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం (Project-based Learning) వంటి ముఖ్యమైన అంశాలు చేర్చబడ్డాయి.

విద్యార్థులలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంతో పాటు, పరిశోధన, విశ్లేషణాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ సిలబస్ మార్పులు దోహదపడతాయి. తెలంగాణను అకడమిక్ ప్రతిభ, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రాముఖ్యమైన లక్ష్యం. త్వరలోనే దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేస్తాము. మా అంకితభావంతో విద్యార్థుల భవిష్యత్‌ను విజయవంతమైన దారిలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ భరోసా ఇచ్చారు.

Next Story