పూరీ బీచ్‌‌లో కేసీఆర్‌ సైకత శిల్పం.. BRS శ్రేణులకు MLC కవిత కీలక పిలుపు

by Gantepaka Srikanth |

ద్రోహులకు దడపుట్టేలా తెలంగాణ తెగువ చూపుదామని.. గులాబీ హోరెత్తించి ఆత్మ గౌరవాన్ని చాటి చెబుదామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

పూరీ బీచ్‌‌లో కేసీఆర్‌ సైకత శిల్పం.. BRS శ్రేణులకు MLC కవిత కీలక పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ద్రోహులకు దడపుట్టేలా తెలంగాణ తెగువ చూపుదామని.. గులాబీ హోరెత్తించి ఆత్మ గౌరవాన్ని చాటి చెబుదామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరీ బీచ్‌‌లో రూపొందించిన కేసీఆర్‌ సైకత శిల్పాన్ని శుక్రవారం బంజారాహిల్స్‌‌లోని తన నివాసం నుంచి ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన డాక్టర్‌ రవీందర్‌ యాదవ్‌ ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు. సైకత శిల్పంలో పార్టీ చీఫ్‌ కేసీఆర్‌ చిత్రం, చలో వరంగల్‌ అంటూ పిలుపునివ్వడంతోపాటు బీఆర్‌ఎస్‌ 25 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించిన వివరాలన్నీ పొందుపరిచారు. ఈ సైకత శిల్పానికి సంబంధించిన వీడియోను రవీందర్‌ యాదవ్‌‌తో కలిసి కవిత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ రజతోత్సవం తెలంగాణ ఇంటి పండుగ అని తెలిపారు. కుంభమేళా తరహాలో నిర్వహిస్తున్న ఈ వేడుకకు ప్రతి ఇంటి నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.




Next Story