- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : కేసీఆర్ ఎత్తుగడ ఫలించింది : బీర్ల ఐలయ్య
బీఆర్ఎస్, బీజేపీ(BRS-BJP) మధ్య రహస్య పొత్తు ఉందని మరోసారి నిజమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్(Beerla Ailaiah Yadav) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్, బీజేపీ(BRS-BJP) మధ్య రహస్య పొత్తు ఉందని మరోసారి నిజమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్(Beerla Ailaiah Yadav) అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు(BJP Chief Ramachandra Rao) నియామకం ద్వారా బీఆర్ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం తేటతెల్లమైందని పేర్కొన్నారు. కేసీఆర్(KCR) రాజకీయ ఎత్తుగడ ఫలించిందని, ఆయనకు అనువైన నాయకుడే బీజేపీ అధ్యక్షుడయ్యారని, ఇక BRS ను బీజేపీలో విలీనం చేసేందుకు మార్గం సుగమం అయిందని ఆరోపించారు.
బీజేపీలో బీసీ నాయకులకు అన్యాయం జరుగుతోందని, అందుకే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) రాజీనామా చేశారని వెల్లడించారు. 2028 ఎన్నికల ముందు BRS బీజేపీలో విలీనం ఖాయమని గతంలో ఐలయ్య పేర్కొనగా.. KTR ఈ ఊహాగానాలను ఖండించారు. కాగా నేడు తెలంగాణ బీజేపీ అధ్యక్షునిగా రామచందర్ రావు నియామకం కాగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ నియమకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. రాజీనామా చేశారు.






