కేసీఆర్ కృషి ఫలించింది : హరీష్ రావు

by Muthe.Rajitha |   (  Updated:2025-07-12 17:13:48  IST  )

ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ శ్రీకారం చుట్టిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందడం సంతోషంగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నేత హరీష్ రావు.

కేసీఆర్ కృషి ఫలించింది : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ శ్రీకారం చుట్టిన సీతారామ ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందడం సంతోషంగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నేత హరీష్ రావు. నాడు ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎండిపోయిన తెలంగాణ పొలాలను పచ్చగా మార్చాలని సంకల్పించిన తెలంగాణ సాధకుడు, రైతుబంధు కేసీఆర్ కల సాకారం అయ్యిందని హర్షం వ్యక్తం చేసారు. బీఆర్ఎస్ హయాంలో గోదావరి నదీ జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేస్తూ చేపట్టిన సీతారామ ప్రాజెక్టు గొప్పతనం ఇప్పుడు తెలిసి వస్తుందని అన్నారు.

సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, నీళ్ళు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు, రైతుల డిమాండ్ కు తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు సీతారామ ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేసిందన్నారు. అలాగే కన్నెపల్లి పంప్ హౌసులు కూడా ఆన్ చేసి రైతులకు నీరివ్వాలని హరీష్ రావు డిమాండ్ చేసారు.

Next Story