- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Sridhar Babu : ఆ రెండు పార్టీలు ఒకటేనని కేసీఆర్ కూతురే చెప్పారు : మినిస్టర్ శ్రీధర్ బాబు
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీల(BRS-BJP)పై తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీల(BRS-BJP)పై తీవ్ర విమర్శలు చేశారు. స్వయంగా కేసీఆర్(KCR) కూతురు కవిత తన లేఖ(Kavitha Letter)లో బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనని చెప్పడం నిజం కాదా అంటూ నిలదీశారు. బీఆర్ఎస్ బీజేపీతో విలీనం కుట్ర జరుగుతోందని కవిత చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఈ రెండు పార్టీల్లో ఎవరు కుట్రలు చేస్తున్నారో వారే తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ ఇచ్చిన నోటీసులను బీఆర్ఎస్, బీజేపీలు రాజకీయంగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్ఎస్ కీలక నాయకులు కాళేశ్వరం అవినీతి నుంచి తప్పించుకోవడానికి ఒక్కటి అవుతున్నాయని.. వారి మధ్య రహస్య సమావేశాలు జరుగుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో ఇతర పార్టీలకు మనుగడ, చిరునామా ఉండదని స్పష్టం చేసిన శ్రీధర్ బాబు.. కాంగ్రెస్ ఒక్కటే రాష్ట్రంలో బలమైన శక్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అయితే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్-బీఆర్ఎస్-బీజేపీ మధ్య వైరాన్ని మరింత తీవ్రతరం చేశాయని తెలుస్తోంది.






